![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -271 లో.....మాణిక్యాన్ని రామలక్ష్మి కలుస్తుంది. ఇక ప్లాన్ ప్రకారం లాయర్ , శంకర్ లని తీసుకొని వచ్చి శ్రీలత చేస్తున్న కుట్ర గురించి చెప్పించాలని మాణిక్యం అనగానే వద్దు నాన్న సీతా సర్ కి తన తల్లి గురించి తెలిస్తే తట్టుకోలేడు. అందుకే తన తప్పు తానే తెలుసుకునే విధంగా చెయ్యాలని రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత శ్రీవల్లి ఇల్లు క్లీన్ చేస్తుంటుంది. అప్పుడే శ్రీలత పై నుండి కిందకి వస్తుంటే రామలక్ష్మి బకెట్ పడేస్తుంది. దాంతో శ్రీలత కింద పడిపోతుంది. అది విని అందరు వస్తారు. శ్రీలత కాలు బెనకడంతో సీతాకాంత్ మసాజ్ చేస్తాడు. అప్పుడే పంతులు వస్తాడు. శ్రీలత గారి జాతకం చూసాను. కొన్ని దోషాలున్నాయి. ఇంకా ఇలాంటివి జరుగుతుతాయి. అందుకే గుడిలో పూజ చెయ్యాలని పంతులు అనగానే.. చేస్తామని సీతాకాంత్ అంటాడు. అందుకు రామలక్ష్మి కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత పంతులు బయటకు వెళ్ళాక.. థాంక్స్ పంతులు గారు నేను అడిగానే హెల్ప్ చేశారని రామలక్ష్మి అనగానే మంచి పని కోసమే కదమ్మా అని పంతులు అంటాడు.
ఆ తర్వాత శ్రీలత వాళ్ళ దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. నేనే కావాలని బకెట్ తన్నానని చెప్పగానే వాళ్లు షాక్ అవుతారు. ఆ తర్వాత అందరు గుడికి బయల్దేరుతారు. రామలక్ష్మి, సీతాకాంత్ లు కలిసి వస్తారు. వాళ్లు ఆలా రావడం శ్రీలత చూడలేకపోతుంది. శంకర్ , లాయర్ లని తీసుకొని మాణిక్యం వస్తాడు. అందరు గుడికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |